బంగ్లాదేశ్‌కు చెందిన మెరు మియా వయసు 35 ఏళ్లు. భిక్షాటనే అతడి జీవనాధారం. రోజూ బయటకు వెళ్లి అడుక్కుంటూ సంపాదించిన డబ్బుతో జీవనం సాగిస్తుంటాడు. అయితే ఇప్పుడు అతడి గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది మాత్రం అతడి సంపాదన గురించి కాదు.
మెరు మియాకు 21 మంది భార్యలు ఉన్నారన్న విషయం వైరల్‌గా మారింది.
ఇంతమంది భార్యలు ఉండటంతో వారి పేర్లు గుర్తుపెట్టుకోవడమే అతడికి పెద్ద సమస్యగా మారిందట. 21 మందిలో కేవలం ఎనిమిది మంది పేర్లు మాత్రమే తనకు గుర్తున్నాయని మెరు మియా చెప్పినట్లు సమాచారం. మిగతా వారి పేర్ల విషయంలో మాత్రం తడబడాల్సి వస్తుందని తెలుస్తోంది.
అతడి రోజువారీ జీవితం కూడా కొంత భిన్నంగానే ఉంటుంది. భిక్షాటనకు వెళ్లేటప్పుడు ప్రతిరోజూ ఒకే భార్యను వెంట తీసుకెళ్లడు. ఒక్కొక్కరికి ఒక్కో రోజు కేటాయిస్తూ షెడ్యూల్ మార్చుకుంటూ ఉంటాడట.
ఒక రోజు ఒక భార్యతో కలిసి బయటకు వెళ్తే.. మరుసటి రోజు మరో భార్య అతడి వెంట ఉంటుంది. ఇలా రోజులు మారే కొద్దీ భార్యలను కూడా మార్చుకుంటూ భిక్షాటనకు వెళ్తున్నట్లు మెరు మియా గురించి వచ్చిన కథనాల్లో పేర్కొన్నారు.
భిక్షాటన ద్వారా వచ్చే ఆదాయమే అతడి ప్రధాన ఆధారం. పెద్దగా ఆస్తులు లేదా సౌకర్యాలు లేని పరిస్థితిలో ఇంత పెద్ద కుటుంబాన్ని ఎలా నిర్వహిస్తున్నాడనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామందికి ఆసక్తిని కలిగిస్తోంది.
మెరు మియా కథలో 21 అనే సంఖ్యే ఎక్కువగా చర్చకు కారణమైంది. ఒకవైపు పేదరికంలో జీవనం.. మరోవైపు 21 మంది భార్యలు. అందులో ఎనిమిది మంది పేర్లు మాత్రమే గుర్తుండటం, భిక్షాటనకు వెళ్లేటప్పుడు భార్యలను వంతుల వారీగా వెంట తీసుకెళ్లడం వంటి వివరాలు బయటకు రావడంతో ఈ కథ మరింత వైరల్‌గా మారింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయంపై రకరకాల వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. అయితే మెరు మియా గురించి వైరల్ అవుతున్న వివరాలు మీడియా కథనాలు, అతడికి ఆపాదించిన వ్యాఖ్యల ఆధారంగా ప్రచారంలో ఉన్నవేనని గమనించాలి.
Source:
For Meru Mia (35), it is a big problem to remember the names of his wives
Because he is married to 21 women, and he just remembers 8 of their names
He is a beggar, he earns his living from begging
Each day, he rotates schedules and takes one of his wives along with him while he begs
Tushar ॐ♫₹ (@Tushar_KN) October 6, 2026